కరముల శంఖచక్రములు కంజదళాక్ష! గదాయుధమ్ము నీ
స్థిరమగు మందహాసమును చిన్మయరూపముఁ బ్రోచు హస్తమున్
కరుణనుఁ గాచుచుండునెడ కష్టము నష్టము లేమి పాపముల్
పరుగులుఁ బెట్టవే పతితపావన భావన చెన్నకేశవా! -11
పెనగొని లోకమంతయును పెంపుగఁ బ్రాకు ననంత దూరముల్
ఘనముగ దానినంతటిని గర్భమునందు ధరించి ప్రేమతో
కనుగొనిఁ గాచుచుండెదవు కంజదళాక్ష! యనంతకాలముల్
నినుఁ బొగడంగజాల డవనీధరుడైనను చెన్నకేశవా! -12
ఇమ్మహినెల్లఁ జేతనుల నీశ్వరఁ! బ్రోతువు జాగృతుండవై
అమ్మవె నీవు! నాదు హృదయమ్మున మేల్కొనుమయ్య ప్రేమలన్
జిమ్ముచు నమ్ముకొంటి మది చీకటిఁ ద్రోలుము శాశ్వతమ్ముగా
లెమ్ము మనమ్మునన్ ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! -13
పదములఁ బుట్టి గంగ కడుపావని శంభుశిరమ్ముఁ జేరె నీ
పదములఁ బట్టి తా కడిగి బ్రహ్మ సృజించె ననంత విశ్వమా
పదములఁ బట్టువారి ఘనపాదసమాశ్రయభాగ్యమిమ్ము భూ
రిదయ దయామయా! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! -14
మ్రొక్కెద నారదాది మునిముఖ్యులు వేల్పులు యెల్లవేళలన్
దిక్కనిఁ గొల్చు పాదమును దిక్కులనన్నిటినొక్క యంగలో
గ్రక్కున గొల్చు పాదమును రక్కసిరాజునుఁ ద్రొక్కివైచి పే
రెక్కిన పాదమున్! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! -15
ఇడుములువేలుకల్గెనని యీసటఁ జెందక నోర్మికల్గి నిన్
సడలని భక్తిఁగొల్చి భవసాగరపారముఁ జేరి ముక్తుడై
కడకనరాని దివ్యపథగామినియౌచు ననంత! నిన్నుఁ జే
రెడి కృప నీడవే! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! -16
అన్యమెరుంగనయ్య భవదంఘ్రిపదమ్మునకన్న మిన్నగా
ధన్యుని జేయు స్థానమును దైత్యుల గూలిచి భక్తకోటికిన్
దైన్యము బాపు ధానమును ధర్మనిబంధమునక్షరమ్ము కా
రుణ్యకబంధమున్ కనగ లోకమునందున చెన్నకేశవా! -17
పంపితివంతకుంగడకు పౌరుష వైభవ మత్త దైత్యులన్
పెంపు వహించి పెంచితివి పేద కుచేలుని స్థాయి సంపదల్
తెంపరికెట్టులౌను భవదీయ కృతంబులనుద్యమించి వా
రింప పురంధరా! ముదిగెరే పురదేవర చెన్నకేశవా! -18
వేకువ సేవసేసి తెర వేగమె తీయ జగమ్ములెల్లెడన్
చీకటి తీసివైచి విరజిమ్మెడు నీ ముఖకాంతి తీయుతన్
మాకవిభేద్యమైనవగు మాయతెరల్ మముఁ జేర్చుఁగాత నీ
శ్రీకర సన్నిధిన్ ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! -19
ఇంతగు చిన్నియాశ జనియించి మనమ్మున నంతఁ బెద్దదై
యంతములేని కర్మచయమందున జీవునిఁ ద్రోయు నంతటన్
అంతములేని యాశలనడంగెడు మాకు భవాంఘ్రియుగ్మమూ
రింత గదయ్య యో ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! -20

9 కామెంట్లు:
పద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.
ధన్యవాదాలండీ.
ఫణి ప్రసన్న కుమార్ గారు,
పద్యాలు చాలా బాగున్నాయి. ముఖ్యముగా "రే"కారానికి యతి కుదిర్చిన తీరు బాగుంది.
"ముదిగెరేపుర" ఊరు పేరా? ఏ జిల్లా?
నేను కూడ మా "మాచెర్ల చెన్న కేశవ స్వామి ' మీద వ్రాయాలని ఉన్నది.. కాని కుదరటము లేదు.
చెన్నకేశవునికి చంపకమాల .. సుందరంగా ఉన్నాయి. అభినందనలు
జిగురు సత్యనారాయణ గారూ, కొత్తపాళి గారూ మీకు పద్యాలు నచ్చినందుకు ధన్యవాదములు. ముదిగెరె గ్రామం కర్నాటక, గౌరీబిదనూరు వద్ద ఉన్నది. అందులో ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి మా కులదైవము. కొన్ని మాసాల ముందు అక్కడ జరిగిన అష్టబంధ జీర్ణోద్ధార మహోత్సవం అనే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు స్వామివారిపైన పద్యాలు వ్రాయాలని ప్రేరణ కలిగింది. ఆయన ప్రేరేపిస్తే శతకం రాద్దామని. అటుపైన ఆయన ఇచ్ఛ.
ఫణీ గారు,
చాలా బాగా రాశారు. ఆ చెన్నకేశవుని యనుగ్రహంతో మీరు తప్పక శతకం పూర్తి చేయగలరు.
మందాకినిగారూ, ధన్యవాదములు.
పద్యాలు చాలా బాగున్నాయి. శతకం పూర్తి చేయండి. స్వామి దయ తప్పక వుంటుంది.
శశిధర్ గారూ,
మీకు పద్యములు నచ్చినందుకు సంతోషం. వ్రాస్తున్నాను. త్వరలో మరిన్ని ప్రచురిస్తాను.
ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి