12, ఫిబ్రవరి 2009, గురువారం

సమస్యా పూరణం

ఇది ఆంధ్రామృతం బ్లాగులో శ్రీ చింతా రామకృష్ణ రావు గారు ఇచ్చిన సమస్యకు పూరణ

సీసము:
వేణుగానము సోకి వీనులు పులకింప
విరిసె దుద్దులలోని వింత రవ్వ
మరునితో పోరి వగరు పైయెద సెగల
ఎరుపెక్కె కంఠాన వెలయు కెంపు
ఇంపైన సఖుని తలంపులకు నొదిగె
పాపిట ముత్యాళి పరవశమున
చెలికాని మరుకేళి జతగూడు తలపుచే
చుంబించె కటియందు కులుకు పచ్చ

చెలుని చూచుకాని చెంతకు పోబోదు
తెలుపలేదు సిగ్గు తమకములచె
రమణి బాధలెల్ల రమ్యముగ మెరిసి
మణులు మాటలాడె మనసు కరుగ

2 కామెంట్‌లు:

mmkodihalli చెప్పారు...

ఫణీ!
నీ పూరణ మిగితా పూరణలకన్నా చాలా చాలా బాగుంది.

Vasu చెప్పారు...

మీ పూరణ అద్భుతంగా ఉంది