25, జులై 2009, శనివారం

కార్టూను


అబ్బే, నిజంగానే ఈ సారి కలెక్షన్ తక్కువైంది కుబేరా ! రిసెషన్ కదా !

17, జులై 2009, శుక్రవారం

కార్టూను ౧౭-౦౭-౨౦౦౯


భక్తుడిని రక్షించే తొందరలో గరుడ వాహనం తేవడం మరిచిపోయా. ఈ ట్రాఫిక్ ను ఎలా దాటాలిరా భక్తుడా!

10, జులై 2009, శుక్రవారం

కార్టూను

బ్లాగ్మిత్రులకు అభినందనలు. కొంత కాలంగా పలు కారణాలవల్ల బ్లాగ్లోకానికి దూరంగా ఉన్నందుకు మన్నించండి. మిమ్మల్ని అలరించే అవకాశం మళ్ళా కలగడం సంతోషంగా ఉంది.
ఫణి

12, ఫిబ్రవరి 2009, గురువారం

సమస్యా పూరణం

ఇది ఆంధ్రామృతం బ్లాగులో శ్రీ చింతా రామకృష్ణ రావు గారు ఇచ్చిన సమస్యకు పూరణ

సీసము:
వేణుగానము సోకి వీనులు పులకింప
విరిసె దుద్దులలోని వింత రవ్వ
మరునితో పోరి వగరు పైయెద సెగల
ఎరుపెక్కె కంఠాన వెలయు కెంపు
ఇంపైన సఖుని తలంపులకు నొదిగె
పాపిట ముత్యాళి పరవశమున
చెలికాని మరుకేళి జతగూడు తలపుచే
చుంబించె కటియందు కులుకు పచ్చ

చెలుని చూచుకాని చెంతకు పోబోదు
తెలుపలేదు సిగ్గు తమకములచె
రమణి బాధలెల్ల రమ్యముగ మెరిసి
మణులు మాటలాడె మనసు కరుగ

14, జనవరి 2009, బుధవారం

సంక్రాంతి శుభాకాంక్షలు

అందరు బ్లాగ్బంధువులకు హార్థిక సంక్రాంతి శుభాకాంక్షలు

9, జనవరి 2009, శుక్రవారం

ఖసాబు మావాడు కాడని బొంకిన కుంకలకి

ఖలురా! తలపై నిప్పిడి
తెలియదు మాకంచు బొంక తలలూచెదమా
ఇలలో సర్వులు మెచ్చగ
వలువల నూడ్పించి మిమ్ము వురికిన్చెదుమీ!

8, జనవరి 2009, గురువారం