27, జనవరి 2010, బుధవారం

శ్రీ ఆర్. సుందరం గారి డెభ్భై ఐదవ జన్మదిన కవిత

మా సంస్థ (సుందరం ఆర్కిటెక్ట్స్ ప్రై. లి.) అధిపతి శ్రీ ఆర్. సుందరం గారి డెభ్భై ఐదవ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేను చదివిన పద్యం.


నూనూగు మీసాల నూత్న యౌవనమున
ప్రౌఢమౌ గురుభక్తి పొందినావు
అట్టిట్టి వనరాని గట్టి మేడలు వేలు
చిట్టి క్రీడగ నీవు కట్టినావు
సుందర సువిశాల సొబగు గుమ్మటముల
మించు ప్రతిభను నిర్మించినావు
నినుగొల్చు భృత్యుల నీలకంఠుని వోలె
కడు ప్రేమతో నీవు కాచినావు

సంతసము గాగ నూరు వసంతములను
సుందరేశుని కృపచేత పొందుమయ్య
నీదు సత్కీర్తి భువినెందు నిల్చునయ్య
కరుణ తోడను మమ్ముల కావుమయ్య